Jul 31, 2014
Aug 23, 2013
తెలుగు దేశం !!
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర అంటాడు. ఎవరి ఆత్మగౌరవం? తెలంగాణా తెలుగు వారిదా? సీమాంద్ర తెలుగువారిదా? మొత్తం తెలుగువారిదైతే మరి "విభజన" ఎందుకు కోరాడు? కొత్త రాజధానికి 5లక్షల కోట్లు ఎందుకు కోరాడు? పైగా ఇప్పుడు "పులి మీద పుట్ర" లాగా 'హరికృష్ణ' రాజీనామా ఒకటి! రాష్ట్ర దుస్థితికి కాంగ్రెస్ ఒక్కదాన్నే కారణం చేయటం 'బాబు'కు ఇష్టం లేనట్లున్నది.
Jul 30, 2013
Telangana
కాంగ్రెస్ ఇప్పటికైనా తెలంగాణా విషయం లో ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటించటం చాలా మంచి విషయం. రాష్ట్రం ఒక అనిచ్చితి నుండి బయట పడటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఒకే పార్టి వారు ఇక్కడో మాట, అక్కడో మాట చెప్పి ఉద్యమాలు రెచ్చగొట్టటం ఇకనైనా మానుకోవాలి. ఏదైనా తమ విధానం, వైఖరి పార్లమెంటు, అసెంబ్లీ లలో చెప్పుకోవాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్ట కూడదు. తెలుగు జాతి ప్రశాంతం గా జీవించాలని అందరం కోరుకోవాలి.
Jul 17, 2013
టెలికాం, రియల్ ఎస్టేట్, మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకం రంగాల్లో విదేశీ పెట్టుబడి ... 100 శాతం !
మరో 9 రంగాల్లో 49 శతం వరకూ అనుమతి !!
ఆఖరుకు దేశ రక్షణ రంగం లోనూ విదేశీ పెట్టుబడికి.. తాజాగా ... సర్కారు ... నిర్ణయం !!!
పెట్టుబడుల గోల తప్ప .. మనం పోరాడి గెల్చిన ... విదేశీ పెత్తనం .. మళ్లీ వస్తోందనే ధ్యాసే ఉండదా? ఒబామా ఒడిలో అంతగా వాలిపోవాలా?
మరో 9 రంగాల్లో 49 శతం వరకూ అనుమతి !!
ఆఖరుకు దేశ రక్షణ రంగం లోనూ విదేశీ పెట్టుబడికి.. తాజాగా ... సర్కారు ... నిర్ణయం !!!
పెట్టుబడుల గోల తప్ప .. మనం పోరాడి గెల్చిన ... విదేశీ పెత్తనం .. మళ్లీ వస్తోందనే ధ్యాసే ఉండదా? ఒబామా ఒడిలో అంతగా వాలిపోవాలా?
Subscribe to:
Posts (Atom)
















